వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ దారుణం.. భార్యను చంపి ఆత్మహత్య
- భార్య సెరినా ఫెయిర్‌ఫ్యాక్స్‌ను కాల్చి చంపిన జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్
- లైంగిక ఆరోపణలతో పూర్తిగా దెబ్బతిన్న రాజకీయ జీవితం
- విడాకుల కేసు, ఆర్థిక సమస్యలతో తీవ్ర నిరాశ
- కొడుకు 911కు కాల్ చేయడంతో బయటపడిన దారుణం
అమెరికాలోని వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, డెమొక్రటిక్ పార్టీలో ఒకప్పుడు ఉద్యమ నేతగా వెలిగిన జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్ (47) దారుణానికి పాల్పడ్డారు. తన భార్య, డెంటిస్ట్ అయిన డాక్టర్ సెరినా ఫెయిర్‌ఫ్యాక్స్‌ను (49) కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వాషింగ్టన్ శివారులోని అన్నేన్డేల్లో ఉన్న వారి నివాసంలో గురువారం ఉదయం ఈ ఘోరం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఇంట్లోని బేస్మెంట్లో జస్టిన్ తన భార్యను కాల్చి చంపారు. అనంతరం పై అంతస్తులోని బెడ్రూమ్లోకి వెళ్లి తన ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో వారి ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వారి కుమారుడు 911కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కొంతకాలంగా ఈ దంపతుల మధ్య విబేధాలు నడుస్తున్నాయి. సెరినా గతేడాది విడాకులకు దరఖాస్తు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ నెలాఖరులోగా ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని జస్టిన్ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ గడువుకు కొన్ని వారాల ముందే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టారు.
2019లో ఇద్దరు మహిళలు చేసిన లైంగిక ఆరోపణలతో జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్ రాజకీయ భవిష్యత్తు పూర్తిగా నాశనమైంది. ఆ ఘటన తర్వాత ఆయన తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి జారుకున్నారని, మద్యానికి బానిసయ్యారని కోర్టు పత్రాలు, స్నేహితుల కథనం ద్వారా తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు కూడా ఆయన్ను చుట్టుముట్టాయి. ఈ ఘటనపై వర్జీనియా రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.