కొత్త లుక్‌లో రామ్ చరణ్... 'ఎస్క్వైర్' కవర్‌పై పవర్‌ఫుల్‌గా గ్లోబల్ స్టార్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రఖ్యాత 'ఎస్క్వైర్ ఇండియా' మ్యాగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై ఆయన మెరిశారు. ఈ సందర్భంగా మ్యాగజైన్, రామ్ చరణ్‌ను "ప్రస్తుత తరాన్ని ప్రభావితం చేస్తున్న గ్లోబల్ ఫోర్స్" అని, "భారతీయ సినిమాకు ఒక ముఖ్యమైన ముఖచిత్రంగా నిలిచారు" అని అభివర్ణించింది.
"రామ్ చరణ్ సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేస్తూ, ఆయన్ను మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో మా కవర్‌పై ఆవిష్కరిస్తున్నాం" అని ఎస్క్వైర్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ఈ ఫోటోషూట్‌ను ప్రత్యేకంగా హాంకాంగ్‌లో నిర్వహించినట్లు సమాచారం.
ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నుంచి స్వల్ప విరామం తీసుకుని ఆయన హాంకాంగ్‌లో జరిగిన ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. విశేషమేమిటంటే, ‘పెద్ది’ సినిమా కోసం మెయింటైన్ చేస్తున్న హెయిర్‌స్టైల్‌తోనే ఆయన ఈ షూట్‌లో కనిపించారు. దీంతో ఆయన లుక్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.