ఏపీ, తెలంగాణ ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా సురేశ్ బత్తిని నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు
- గతంలో హైదరాబాద్ రీజియన్లో చీఫ్ కమిషనర్గా పని చేసిన సురేశ్
- ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా ఉన్న మోరంపూడి అనిల్ కుమార్
- ఆయన స్థానంలో సురేశ్ బత్తిని నియామకం
సురేశ్ బత్తిని గతంలో హైదరాబాద్ రీజియన్లో చీఫ్ కమిషనర్గా పని చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని పన్నుల పరిపాలన, ఆదాయ వసూళ్ల లక్ష్యాలు, శాఖాపరమైన అంశాలపై ఆయనకు పూర్తిస్థాయి అవగాహన ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖకు సంబంధించి అత్యున్నత పదవి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పదవి. పన్ను వసూళ్ల లక్ష్యాలను పర్యవేక్షించడంతో పాటు చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడం, శాఖాపరమైన పరిపాలనను సమన్వయం చేయడం వంటివి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ప్రధాన బాధ్యతలు.