ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను: సమంత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను: సమంత

Samantha Credits Raj Nidimoru for Her Courage and Success
  • ఒడిదుడుకుల సమయంలో భర్త రాజ్ తనకు అండగా నిలిచారన్న సమంత
  • తాను ఇంత ధైర్యంగా ఉండటానికి తన భర్తే కారణమని వెల్లడి
  • తమ మధ్య బలమైన అనుబంధం ఉందన్న సామ్

నటి సమంత తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పంచుకున్న భావోద్వేగపూరిత వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్నో సవాళ్లను దాటుకుని కెరీర్‌లో దూసుకుపోతున్న సమంత, తన భర్త రాజ్ నిడమోరు తన జీవితంలో ఎంతటి కీలక పాత్ర పోషించారో వివరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.


తన జీవితంలోని ఒడిదుడుకుల సమయంలో రాజ్ తనకు అండగా నిలిచారని సమంత పేర్కొన్నారు. "నేను ఈ రోజు ఇంత ధైర్యంగా ఉండటానికి, ఒక మంచి నటిగా ఎదగడానికి ప్రధాన కారణం ఆయనే" అని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరచడంలో రాజ్ నిరంతరం ప్రోత్సహిస్తారని వెల్లడించారు.


తామిద్దరం వృత్తిపరమైన పనులే కాకుండా, వర్కవుట్స్ వంటి వ్యక్తిగత పనులను కూడా కలిసే చేస్తామని సమంత చెప్పారు. ఒక్క రోజు కూడా ఆయనకు దూరంగా ఉండలేనంతగా తమ మధ్య అనుబంధం ఉందని తన ప్రేమానురాగాలను చాటుకున్నారు.


ప్రస్తుతం సమంత.. రాజ్ నిర్మాణంలో వస్తున్న 'మా ఇంటి బంగారం' అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, తన విజయానికి మూలస్తంభంగా నిలిచిన భర్త గురించి సమంత గొప్పగా చెప్పడం ఆమె అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీరి జోడీ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మరిన్ని విజయాలు అందుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement
Samantha
Samantha Ruth Prabhu
Raj Nidimoru
Ma Inti Bangaram
Nandini Reddy
Telugu cinema
actress
marriage
relationship
Tollywood

More Telugu News