హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం అడ్వైజరీ
- ప్రకటన విడుదల చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్
- సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచన
- రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలన్న కేంద్రం
భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, నౌకలలో ఉన్న వారు అందులోనే ఉండాలని సూచించింది. అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని కోరింది. అధికారులు, కంపెనీ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని పంచుకోవాలని తెలిపింది.
ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి కారణంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది.