Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీకి 'ధురంధర్' డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చిన రాఘవ్ చద్దా
తనను రాజ్యసభలో ఉపనేత పదవి నుంచి తొలగించడంతో ఆమ్ ఆద్మీ పార్టీపై ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన 'ధురంధర్' చిత్రం డైలాగ్‌తో విమర్శలు గుప్పించారు. "గాయపడ్డాను కాబట్టి మరింత దృఢంగా మారాను" అనే డైలాగ్‌తో ఆమ్ ఆద్మీ పార్టీకి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన వీడియోను షేర్ చేశారు.
రాఘవ్ చద్దాను ఉపనేత పదవి నుంచి తొలగించడంతో ఆయనకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మాటల యుద్ధం సాగుతోంది. పార్టీ నేతల ఆరోపణలపై ఆయన స్పందించారు. తనపై పథకం ప్రకారమే పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, అనుకోకుండా జరిగినది కాదని అన్నారు. పార్టీ నాయకులు తనపై మూడు ఆరోపణలు చేశారని, కానీ ఎందులోనూ వాస్తవం లేదని అన్నారు.
ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేసినప్పుడు పార్టీ నేతలతో కలిసి బయటకు వెళ్లలేదనే ఆరోపణల్లో నిజం లేదని రాఘవ్ చద్దా తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా తీసుకువచ్చిన తీర్మానంపై తాను సంతకం చేయడానికి తిరస్కరించాననేది కూడా వాస్తవం కాదని అన్నారు. మోదీకి భయపడి తాను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నానని ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఏ విషయంలో భయపడ్డానో చెప్పాలని నిలదీశారు.
జీఎస్టీ, పంజాబ్ నీటి సమస్యలు, భారత రైల్వేలో ఇబ్బందులు వంటి అనేక సమస్యలను సభలో లేవనెత్తినట్లు తెలిపారు. ప్రజల తరఫున ప్రభుత్వంతో పోరాడేందుకు తాను సభకు వెళుతున్నానని అన్నారు. కానీ అక్కడ గందరగోళం సృష్టించి, కుర్చీలు విరగ్గొట్టడానికి కాదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చర్యలతో తాను గాయపడ్డానని, అందుకే మరింత దృఢంగా అయ్యానని అన్నారు.