Chandrababu Naidu: మాచర్ల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్... నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం

Chandrababu Naidu Serious on Macherla Incident Orders Strict Action
షార్ట్స్‌లో చూడండి
మాచర్ల పట్టణంలో ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై జరిగిన అత్యాచార యత్నం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

పల్నాడు జిల్లా మాచర్లలోని పంచాయతీరాజ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఓ ఆగంతకుడు చొరబడి అత్యాచారానికి యత్నించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామని, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

నిందితుడిని పట్టుకోవడం కోసం అదనపు ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సమాజానికి బలమైన సందేశం పంపాలని సీఎం పోలీసులకు సూచించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Macherla
Andhra Pradesh Crime
Women Safety Andhra Pradesh
Palanadu District
Government Employee Assault
Guntur GGH
AP Police
Crime News
Sexual Assault

More Telugu News