Tianlong-3: కూలిపోయిన చైనా రాకెట్ .. వీడియో ఇదిగో!
అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘స్పేస్ పయనీర్’ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘తియాన్‌లాంగ్-3’ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఏప్రిల్ 3న జరిగిన ఈ పరీక్షలో, రాకెట్ నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలింది.
స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ‘ఫాల్కన్ 9’ రాకెట్‌కు పోటీగా తియాన్‌లాంగ్-3ని రూపొందించారు. భారీ పేలోడ్లను మోసుకెళ్తూ, తిరిగి భూమిపైకి వచ్చి ల్యాండ్ అయ్యే పునర్వినియోగ టెక్నాలజీతో దీనిని తయారుచేశారు. డాంగ్‌ఫెంగ్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ సెంటర్ నుంచి ప్రయోగించిన కొన్ని నిమిషాలకే రాకెట్ తన గమ్యం నుంచి వైదొలిగి, నిర్దేశిత కక్ష్యను చేరుకోలేకపోయింది. రాకెట్ మొదటి దశ విడిపోయే క్రమంలో లేదా ఇంజిన్ పనితీరులో తలెత్తిన సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ వైఫల్యంపై స్పేస్ పయనీర్ సంస్థ విచారం వ్యక్తం చేసింది. ‘‘తొలి ప్రయత్నంలో ఆశించిన ఫలితం రాకపోవడం బాధాకరం. మా భాగస్వాములకు, శాస్త్రవేత్తలకు క్షమాపణలు చెబుతున్నాము. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని, తదుపరి మిషన్లను మరింత పటిష్ఠంగా నిర్వహిస్తాము’’ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో పట్టు సాధించాలని చైనా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో తియాన్‌లాంగ్-3 వైఫల్యం చైనా ప్రైవేట్ అంతరిక్ష కార్యక్రమాలకు తాత్కాలిక అవరోధంగా నిలిచింది.