Talasani Srinivas Yadav: మా అల్లుడు తులం బంగారం అడుగుతున్నాడు: తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మహిళ

Talasani Srinivas Yadav Responds to Womans Gold Request
షార్ట్స్‌లో చూడండి
సికింద్రాబాద్‌లో కల్యాణ లక్ష్మి పంపిణీ కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓ మహిళ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సికింద్రాబాద్‌లోని తహసీల్దారు కార్యాలయంలో ఆయన చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక మహిళ కల్యాణ లక్ష్మి చెక్కును తీసుకున్న అనంతరం తులం బంగారం గురించి అడిగారు.

ఆడపిల్ల వివాహానికి తులం బంగారం ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదని ఆ మహిళ తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో అన్నారు. వివాహం సమయంలో ప్రభుత్వం ఇచ్చే తులం బంగారం ఇస్తామని మా అల్లుడికి చెప్పడంతో, అతను అడుగుతున్నట్లు తెలిపారు. దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ నవ్వుతూ, హామీ ఇచ్చిన వారు ఇవ్వడం లేదని, దానికి మనమేం చేస్తామని సమాధానం ఇచ్చారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వివాహం కోసం ప్రతి ఆడపిల్లకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Go Back to Shorts
Talasani Srinivas Yadav
Kalyana Lakshmi
Telangana
Congress Party
Gold Scheme
Assembly Elections

More Telugu News