Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం కేసు... బస్సు యజమాని అరెస్ట్

Markapuram Bus Accident Owner Driver Arrested
షార్ట్స్‌లో చూడండి

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. 14 మంది ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో, బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు యజమాని హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.


ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు వీరికి రిమాండ్ విధించే అవకాశం ఉంది. టిప్పర్ లారీని ఢీకొట్టిన ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కాగా, చికిత్స పొందుతూ ఒక బాలుడు మరణించాడు.

Go Back to Shorts
Markapuram Bus Accident
Prakasam district
bus accident
Andhra Pradesh
road accident
bus owner arrested
Harikrishna
Yuvaraju

More Telugu News