Jio: జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో!

Jio Announces Attractive Broadband Offer Details Here
షార్ట్స్‌లో చూడండి
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ‘జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్’ ప్లాన్లపై ఈ ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తోంది. మూడు నెలల ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వారికి అదనంగా ఒక నెల వాలిడిటీ ఉచితంగా లభిస్తుంది. అంటే, మూడు నెలల ధరకే నాలుగు నెలల పాటు సేవలు పొందవచ్చని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

జియో హోమ్ అనేది కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే కాదు. ఇందులో బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు లైవ్ టీవీ ఛానళ్లు, ఓటీటీ యాప్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి సేవలు ఒకే ప్యాకేజీలో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు పూర్తిస్థాయి డిజిటల్ అనుభవాన్ని అందించడమే ఈ సేవ ప్రత్యేకత.

ఈ ఆఫర్‌లో భాగంగా రూ.555 ఎంట్రీ లెవల్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పాటు నెలకు 1000 జీబీ డేటా, 800కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు, 10-12 ఓటీటీ యాప్‌ల సేవలు పొందుతారు. అలాగే, 100 Mbps స్పీడ్ కోరుకునే వారి కోసం రూ.833, రూ.1111 ప్లాన్లు ఉన్నాయి. రూ.833 ప్లాన్‌లో 1000జీబీ డేటా, కాలింగ్, ఓటీటీ యాప్‌లు లభిస్తాయి. ఇక రూ.1111 ప్లాన్‌లో 16 వరకు ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్లన్నింటికీ మూడు నెలల రీచార్జ్‌పై ఒక నెల అదనపు వాలిడిటీ వర్తిస్తుంది.
 
Go Back to Shorts
Jio
Jio Fiber
Jio Broadband
Reliance Jio
Broadband Plans
OTT Apps
Internet Plans
Jio Home Broadband
Data Plans
Free Validity

More Telugu News