Iran: అమెరికా మా షరతులకు అంగీకరిస్తేనే యుద్ధం ఆగుతుంది: ఇరాన్
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలపై పక్కా ప్రణాళికతో చేయాలనుకున్న సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, అమెరికా మెత్తబడినప్పటికీ ఇరాన్ మాత్రం తన వైఖరిని స్పష్టం చేసింది. తమపై విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేసి, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసింది.
సోమవారం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. "గత రెండు రోజులుగా ఇరాన్‌తో జరిపిన చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయి. ఈ చర్చల స్ఫూర్తితో ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేపట్టాల్సిన సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయాలని ఆదేశించాను" అని ట్రంప్ పేర్కొన్నారు. చర్చల పురోగతిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.
ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయీ స్పందించారు. 'న్యూస్18' కథనం ప్రకారం... "మాపై విధించిన ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసి, మాకు జరిగిన నష్టాన్ని పరిహారంగా చెల్లించే వరకు యుద్ధం కొనసాగుతుంది" అని ఆయన అన్నారు. అంతేగాక ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోదని అంతర్జాతీయ హామీ కూడా కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన ప్రక్రియ సంక్లిష్టంగానే ఉందని స్పష్టమవుతోంది.