Mumbai Beach Man: కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా! ముంబై బీచ్‌లో ఓ వ్యక్తి వింత వ్యాపారం.. వీడియో ఇదిగో!

Mumbai Beach Man Charges Fee to Listen to Problems
షార్ట్స్‌లో చూడండి
ఉరుకుల పరుగుల జీవితంలో మనసులోని మాటను వినేవారే కరవయ్యారు. ఈ ఆధునిక సమాజంలో నెలకొన్న ఒంటరితనాన్ని, ఒత్తిడిని ఓ వ్యక్తి వ్యాపారంగా మార్చుకున్నాడు. ముంబైలోని ఓ సముద్ర తీరంలో కూర్చుని, ఇతరుల కష్టాలను, బాధలను వినడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే, ఈ సేవ ఉచితం కాదు. సమస్య తీవ్రతను బట్టి ఫీజు వసూలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ఆయన వద్ద సమస్యలకో రేట్ల పట్టిక కూడా ఉంది. చిన్న చిన్న సమస్యలు చెప్పుకోవాలంటే రూ.250, తీవ్రమైన ఆందోళనలు, కష్టాల గురించి మాట్లాడాలనుకుంటే రూ.500 చెల్లించాలి. ఎవరైనా తన వద్ద కూర్చుని ఏడుస్తూ తమ బాధను వెళ్లగక్కాలనుకుంటే గంటకు రూ.1,000 వసూలు చేస్తానని ఆయన చెబుతున్నారు. కేవలం డబ్బు కోసమే ఈ పని చేయడం లేదని, సైకాలజీ, ఫిలాసఫీ తనకిష్టమైన సబ్జెక్టులని, బాధలో ఉన్నవారికి కాస్త ఊరట కలిగించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఆశ్చర్యకరంగా చాలామంది ఆయన సేవలను వినియోగించుకుంటున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత మనసు తేలికపడిందని కొందరు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వేలకు వేలు ఖర్చుపెట్టి థెరపిస్టుల వద్దకు వెళ్లే బదులు, ఇలా ప్రశాంతమైన వాతావరణంలో మనసులోని భారాన్ని దించుకోవడం మేలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకరి మాట మరొకరు వినే ఓపిక, సమయం లేకపోవడం వల్లే ఇలాంటి 'లిజనింగ్ సర్వీసెస్‌'కు ఆదరణ లభిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Mumbai Beach Man
Mumbai
Beach
Listening services
Therapist
Stress
Anxiety
Mental health
Business idea

More Telugu News