గ్యాస్, చమురు నిల్వలు ఎంత ఉన్నాయో చెప్పండి: ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు
- ఇంధన అవసరాలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలు
- కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేసే ఉద్దేశంతో నోటిఫికేషన్
- పీపీఏసీ వివరాలు అందివ్వాలని కంపెనీలకు ఆదేశం
దేశంలో ఇంధన, గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, సహజవాయువు సరఫరా గొలుసును పర్యవేక్షించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కంపెనీలు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ)కు ఈ వివరాలు అందించాలని సూచించింది.