ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్ .. 'ఫోర్త్ ఫ్లోర్'
- తమిళ సినిమాగా వచ్చిన 'ఫోర్త్ ఫ్లోర్'
- సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్
- ప్రధానమైన పాత్రలో ఆరి అర్జునన్
- ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన సినిమా
- ఈ నెల 20వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో
ఈ సినిమా ఓటీటీ హక్కులను 'సన్ నెక్స్ట్' వారు తీసుకున్నారు. ఈ నెల 20 వతేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన వదిలారు. ధరణ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, తలైవాసల్ విజయ్ .. సుబ్రమణియన్ శివ .. ఆదిత్య కథిర్ .. బేబీ శ్రీవర్షిణి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు.
కథ విషయానికి వస్తే .. ఒక రోజున ధీరన్ కి అనూ కాల్ చేసి చెన్నై లో తనని కలుసుకోవడానికి రమ్మంటుంది. గతంలో ఆమెతో ప్రేమలో ఉన్న ధీరన్ చెన్నైకి వెళతాడు. అనూ చెప్పిన సమయానికి కలవకపోవడంతో, అక్కడే ఒక అపార్టుమెంటులోని 'ఫోర్త్ ఫ్లోర్'లో దిగుతాడు. అప్పటి నుంచి అతనికి అక్కడ చిత్రమైన అనుభవాలు ఎదురవడం మొదలవుతుంది. అందుకు కారణం ఏమిటనేది అన్వేషించే సమయంలో అతనికి తెలిసే నిజాలు ఏమిటి? అనేది కథ.