Vijay: ఎన్డీఏ గూటికి విజయ్ పార్టీ?.. తెర వెనుక పావులు కదుపుతున్న త్రిష!
తమిళనాడు రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అధికార డీఎంకేను ఎదుర్కోవడానికి ఎన్డీఏ కూటమి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతుండగా, ఇప్పుడు నటి త్రిష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో నిర్వహించిన పలు సర్వేల ప్రకారం.. డీఎంకే కూటమికి 5 శాతం ఓట్ల ఆధిక్యం ఉన్నప్పటికీ, విజయ్ పార్టీ దాదాపు 12 శాతం ఓట్లను చీల్చే అవకాశం ఉందని తేలింది. ఈ ఓటు బ్యాంకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలదు కాబట్టి, విజయ్‌ను తమ వైపు తిప్పుకోవాలని ఎన్డీఏ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో విజయ్ పలు సమస్యలతో సతమతమవుతున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ, ఆయన తాజా చిత్రం 'జననాయగన్' సెన్సార్ చిక్కులు, రూ.120 కోట్ల ఓటీటీ ఒప్పందం రద్దు కావడం వంటివి ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో విజయ్‌కు అత్యంత సన్నిహితురాలైన త్రిష రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గత వారం ఆమె ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని, ఆ తర్వాతే విజయ్‌కు సంబంధించిన కేసుల్లో కదలిక వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 15న సీబీఐ విచారణకు హాజరైన విజయ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా బయటకు రావడం, ఆగిపోయిన సినిమాకు సెన్సార్ బోర్డు పునఃపరిశీలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక త్రిష మంత్రాంగం ఉందనే వాదన వినిపిస్తోంది. కేవలం ఎన్డీఏకే కాకుండా, అన్నాడీఎంకే నేత పళనిస్వామి కుమారుడితోనూ త్రిష సమావేశం కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది.