Hyderabad bus accident: హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

Hyderabad Bus Accident 10 Injured in Pharma Company Bus Mishap
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ శివారు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. లీ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు ఈరోజు ఉదయం కూకట్‌పల్లి నుంచి 10 మంది ఉద్యోగులతో గడ్డపోతారంలోని కంపెనీకి బయలుదేరింది. మార్గమధ్యంలో బాచుపల్లి సమీపంలోని ఓ మలుపు వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి పక్కకు బోల్తా పడింది. దీంతో బస్సులోని ఉద్యోగులందరూ గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  
Go Back to Shorts
Hyderabad bus accident
Miyapur
Lee Pharma
Bachupally
Road accident
Hyderabad
Kukatpally
Pharma company bus
Gaddapotharam
Bus overturn

More Telugu News