Oscars: ఆస్కార్ వేదికపై అరుదైన ‘టై’.. ఒకే అవార్డుకు ఇద్దరు విజేతలు!

Oscars Tie Rare Event Two Winners Share Award
షార్ట్స్‌లో చూడండి
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఓ అరుదైన, ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో కేవలం ఏడోసారి ఒకే కేటగిరీకి ఇద్దరు విజేతలుగా నిలిచి ‘టై’ నమోదైంది. ఈ ఊహించని పరిణామంతో డాల్బీ థియేటర్ ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగింది. 

వివరాల్లోకి వెళ్తే, బెస్ట్ లైవ్‌ యాక్షన్‌ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డును ప్రకటించేందుకు నటుడు కుమాయిల్ నంజియాని వేదికపైకి వచ్చారు. విజేత పేరు ప్రకటించేందుకు ఎన్వలప్ తెరిచిన ఆయన, ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. అనంతరం, ‘ఈ కేటగిరీలో టై అయ్యింది. ఇద్దరు విజేతలు ఉన్నారు’ అని ప్రకటించడంతో సభలో ఆసక్తి నెలకొంది. ఈ అవార్డును ‘ది సింగర్స్‌’, ‘టూ పీపుల్‌ ఎక్ఛ్సేంజ్‌ సలైవా’ చిత్రాలు సంయుక్తంగా గెలుచుకున్నాయి. 

ఈ సందర్భంగా కుమాయిల్ నంజియాని చమత్కరిస్తూ, ‘షార్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వడానికి రెట్టింపు సమయం పట్టడం విచిత్రంగా ఉంది’ అన్నారు. దీనిపై హోస్ట్ కోనన్ ఓబ్రియన్ స్పందిస్తూ, ‘ఈ టై వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ బెట్టింగ్ వేసిన 22 మిలియన్ల మంది పరిస్థితి ఏంటి?’ అని జోక్ చేయడంతో సభలో నవ్వులు పూశాయి. ఈ అరుదైన ఘటన సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.
 
 
Oscars
Oscar Awards
Academy Awards
Best Live Action Short Film
The Singers
Two People Exchange Saliva
Kumail Nanjiani
Dolby Theatre
Movie Awards
Film Awards

More Telugu News