Hyderabad Gas Shortage: హైదరాబాద్‌లో తీవ్ర గ్యాస్ కొరత.. పెళ్లి వేడుకలపై నీలినీడలు
- పశ్చిమాసియా యుద్ధంతో దేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత
- పెళ్లిళ్ల సీజన్‌పై ప్రభావం.. ఆందోళనలో కుటుంబాలు
- గ్యాస్ లేదంటూ చేతులెత్తేస్తున్న క్యాటరింగ్ నిర్వాహకులు
- వేలాది కార్మికుల ఉపాధిపై కోలుకోలేని దెబ్బ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు దేశీయంగా శుభకార్యాలపై తీవ్రంగా పడుతోంది. అంతర్జాతీయంగా సరఫరా నిలిచిపోవడంతో ఎల్‌పీజీ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ఈ నెల 18 నుంచి మొదలుకానున్న పెళ్లిళ్ల సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్న కుటుంబాలు, అతిథులకు భోజనాలు ఎలా పెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నాయి.
హైదరాబాద్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు దాదాపుగా నిలిచిపోయాయి. గ్యాస్ అందుబాటులో లేక నగరంలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. దీని ప్రభావం నేరుగా క్యాటరింగ్ రంగంపై పడింది. భారీ ఆర్డర్లు తీసుకున్న నిర్వాహకులు, గ్యాస్ లేకుండా వంటలు చేయడం సాధ్యం కాదని చేతులెత్తేస్తున్నారు. తీసుకున్న అడ్వాన్సులను సైతం తిరిగి ఇచ్చేస్తున్నారు.
మార్చి 18 నుంచి మే వరకు పెళ్లిళ్లకు అధికంగా ముహూర్తాలు ఉన్నాయి. కేవలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే సుమారు 15 వేల వివాహాలు జరగవచ్చని ఒక అంచనా. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు జూన్ వరకు బుక్ అయిపోయాయి. అయితే, గ్యాస్ కొరతతో ఇప్పుడు పెళ్లిళ్లు జరపాలా లేక వాయిదా వేసుకోవాలా అని చాలా కుటుంబాలు పునరాలోచనలో పడ్డాయి.
ఈ సంక్షోభం కేవలం పెళ్లిళ్లకే పరిమితం కాలేదు. ఈ సీజన్‌ను నమ్ముకుని జీవించే వేలాది మంది ఉపాధిని దెబ్బతీస్తోంది. క్యాటరింగ్ సిబ్బందితో పాటు పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, డెకరేటర్లు, బ్యాండ్ మేళం వంటి ఎన్నో అనుబంధ రంగాల వారికి పని లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని, యుద్ధం ఇలాగే కొనసాగితే నిత్యావసరాల ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.