ఈ నెల 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

PM Kisan 22nd Installment to be Released on June 13
  • రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ
  • దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు లబ్ది
  • గువాహటి వేదికగా రూ.19 వేల కోట్లు రిలీజ్ చేయనున్న మోదీ
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన నేపథ్యంలో శుక్రవారం గువాహటి వేదికగా నిధులు విడుదల చేస్తారని తెలిపింది. రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తోంది.

2019 లో ఎన్డీయే సర్కారు ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా.. ఏటా మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీ మొత్తం రూ.19 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు చొప్పున జమ అవుతాయని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
PM Kisan
PM Kisan Scheme
Narendra Modi
Kisan Nidhi
Farmers Welfare
Indian Farmers
Agriculture Scheme India
Guwahati
Assam
NDA Government

More Telugu News