Hyderabad Hotels: బెంగళూరు, చెన్నై బాటలో హైదరాబాద్.. గ్యాస్ కొరతతో హోటళ్ల ఆందోళన.. బంద్‌పై అసోసియేషన్ ఏం చెప్పిందంటే..!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో వాణిజ్య గ్యాస్ సరఫరాకు అంతరాయం
- బెంగళూరు, చెన్నైలలో ఇప్పటికే హోటళ్ల మూసివేత ప్రకటన
- హైదరాబాద్‌లోనూ ఆగిపోయిన గ్యాస్ సరఫరా.. హోటల్స్ అసోసియేషన్ ఆందోళన
- గ్యాస్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాలకు యాజమాన్యాల విజ్ఞప్తి
- హైదరాబాద్‌లో బంద్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధం ఇప్పుడు భారత హోటల్ పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. అంతర్జాతీయంగా చమురు రవాణాకు ఆటంకం కలగడంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండగా, ఇప్పుడు ఆ ప్రభావం హైదరాబాద్‌పైనా పడింది. నగరంలోని హోటళ్లకు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సమస్యపై చర్చించేందుకు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. గత వారం రోజులుగా గ్యాస్ ధరలు పెరిగాయని, ఇప్పుడు ఏకంగా సరఫరానే ఆగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సరఫరా ఇకపై కష్టమని డిస్ట్రిబ్యూటర్లు చేతులెత్తేస్తున్నారని, ప్రభుత్వం నుంచి కూడా తమకు ఎలాంటి స్పష్టత రాలేదని అన్నారు. "మనుషులకు ఆక్సిజన్ ఎంత అవసరమో, హోటళ్లకు గ్యాస్ కూడా అంతే ముఖ్యం. గ్యాస్ లేకపోతే వంటలు చేయడం అసాధ్యం" అని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి మీదుగా ముడి చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇదే గ్యాస్ కొరతకు, ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఇప్పటికే బెంగళూరులో అనేక హోటళ్లు తాత్కాలికంగా మూతపడగా, చెన్నైలో కూడా హోటళ్లను మూసివేస్తున్నట్లు అక్కడి అసోసియేషన్ ప్రకటించింది. విశాఖపట్నంలోనూ మూసివేత ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.
ఈ గ్యాస్ కొరత హోటల్ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, హైదరాబాద్‌లో హోటళ్ల బంద్‌పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని, గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో హోటల్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు.