Nara Lokesh: అది ఫేక్ ప్రచారం... వాటిని నమ్మొద్దు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Slams YSRCP Fake Propaganda on Temple Attacks
  • దేవాలయాల విధ్వంసంపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందన్న మంత్రి లోకేశ్
  • కసాపురం ఆలయ పునర్నిర్మాణ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్
  • ఆగమ సలహాదారుల ప్రకారమే పాత ఆలయాన్ని తొలగించామని వెల్లడి
  • వైసీపీ పేటియం బ్యాచ్ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరిక
వైసీపీ నాయకత్వంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆలయాలపై దాడులు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

రాష్ట్రంలో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లు వైసీపీ ఫేక్ ముఠా ప్రచారం చేస్తోంది... ఇందులో ఎలాంటి వాస్తవం లేదు... వీటిని నమ్మొద్దు... ప్రజల మధ్య కులం, మతం, ప్రాంతం పేరుతో అలజడి రేపేందుకు యత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయ పునర్నిర్మాణం సందర్భంగా తీసిన వీడియోలతో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దేవాలయ గర్భాలయం, విమానగోపురం, అర్థ మండపం రాతి నిర్మాణపు పనులు 60 శాతం పూర్తయ్యాయి. దేవస్థానం వైదిక కమిటీ సభ్యుల తీర్మానం ప్రకారం, ఆగమ సలహాదారుల సూచనల మేరకు ఫిబ్రవరి 28న శాస్త్రోక్తంగా పాత ఆలయాన్ని తొలగించారు. ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ పేటియం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 
Nara Lokesh
AP Government
YSRCP
Fake News
Temple demolition
Andhra Pradesh
Guntakal
Kasapuram
Nettikanti Anjaneyaswamy Temple
Hindu Temples

More Telugu News