హైదరాబాద్‌లో కర్ణాటక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
- కొండాపూర్ సుమధుర అపార్ట్‌మెంట్‌లో ఘటన
- ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న మనుశ్రీ
- పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య
పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మనుశ్రీ కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి. నిన్న రాత్రి నుంచి ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు పక్క గదిలో ఉంటున్న యువతికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పక్క గదిలో ఉంటున్న యువతి వచ్చి గది తలుపులు తీయడంతో ఫ్యానుకు ఉరివేసుకుని వికతజీవిగా కనిపించింది. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.