Janhvi Kapoor: జాన్వీ కపూర్ కు రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్
- జాన్వీ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
- సోషల్ మీడియాలో 'పెద్ది' బిహైండ్ ది సీన్స్ వీడియో షేర్
- జాన్వీ నటన పట్ల అంకితభావం అద్భుతమన్న చెర్రీ
- అక్కపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఖుషీ కపూర్
- వయసు, ట్యాక్సులంటూ జాన్వీని ఆటపట్టించిన వరుణ్ ధావన్
ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం 'పెద్ది'. జాన్వీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బిహైండ్ ది సీన్స్ (బీటీఎస్) దృశ్యాలను చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర 'అచ్చియమ్మ' గెటప్‌లో కనిపిస్తూ సందడి చేశారు.
షూటింగ్ సమయంలో చరణ్, జాన్వీ ఇతర టీమ్ మెంబర్స్‌తో సరదాగా గడుపుతున్న లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. ఈ సందర్భంగా చరణ్ స్పందిస్తూ.. "మా అచ్చియమ్మ, ఎంతో హుందాగా ఉండే జాన్వీ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. తన వృత్తి పట్ల ఆమెకున్న ప్యాషన్, నిబద్ధత చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది తనకి అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని రాసుకొచ్చారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నాయి. రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నేషనల్ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
మరోవైపు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ కూడా కొన్ని అన్ సీన్ ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. "నా బెస్ట్ ఫ్రెండ్, నా టీచర్, నేను ఈ రోజు ఇలా ఉండటానికి కారణం నువ్వే.. నువ్వు లేకుండా నేను లేను" అంటూ అక్కపై ప్రేమను చాటుకున్నారు. ఇక 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' చిత్రంలో జాన్వీతో నటిస్తున్న వరుణ్ ధావన్ ఫన్నీగా విష్ చేశారు. "నాకంటే నువ్వు వయసులో చాలా పెద్దదానివైనా.. నా లైఫ్ లో ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఎప్పుడూ సంతోషంగా ఉంటూ, సక్రమంగా ట్యాక్సులు కట్టాలని కోరుకుంటున్నా" అంటూ ఇన్ స్టా స్టోరీలో జాన్వీని సరదాగా ఆటపట్టించారు.