Nagandla Anil Choudary: జిమ్‌లో వ్యాయామం చేస్తూ హైదరాబాద్ టెక్కీ హఠాన్మరణం

Nagandla Anil Choudary Hyderabad Techie Dies of Heart Attack at Gym
  • జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో చోటుచేసుకున్న విషాద ఘటన
  • ఏసిబో జిమ్ వాష్‌రూమ్‌లో కుప్పకూలిన నాగండ్ల అనిల్ చౌదరి
  • సీపీఆర్ చేసినా దక్కని ఫలితం.. ఆసుపత్రికి తరలించేలోపే మరణం
  • గుండెపోటుతోనే అనిల్ చౌదరి మరణించినట్లు డాక్టర్ల నిర్ధారణ
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఈ మధ్యకాలంలో వ్యాయామం చేస్తూ, లేదా ఆడుతూ ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని నాగండ్ల అనిల్ చౌదరి (36)గా గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ఏసిబో జిమ్‌కు అనిల్ చౌదరి నిత్యం వ్యాయామం కోసం వెళుతుండేవాడు. ఎప్పటిలాగే అతడు జిమ్‌కు వచ్చి, కాసేపు వ్యాయామం చేసిన అనంతరం వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అయితే అక్కడ ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపోయాడు.

దీనిని గమనించిన జిమ్ నిర్వాహకులు, ఇతరులు వెంటనే స్పందించి అనిల్ చౌదరికి సీపీఆర్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతనిలో ఎటువంటి చలనం లేకపోవడంతో.. హుటాహుటీన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అనిల్‌ను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే అతను గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. 36 ఏళ్ల చిన్నవయసులోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుండెపోటుతో మరణించడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Nagandla Anil Choudary
Hyderabad
techie
gym
heart attack
Jubilee Hills
Acibo Gym
CPR
software employee
sudden death

More Telugu News