Nagarkurnool Case: నాగర్‌కర్నూల్ విద్యార్థిని ప్రసవం కేసులో బిగ్ ట్విస్ట్.. తోటి విద్యార్థిని ఇరికించబోయిన బాలిక‌.. చివ‌రికి!

Nagarkurnool Case Twist Student Implicates Friend then Confesses
  • నాగర్‌కర్నూల్‌లో ఇంటర్ విద్యార్థిని ప్రసవం కేసులో ఊహించని మలుపు
  • తోటి విద్యార్థిపై నెపం మోపి, బంధువును కాపాడే యత్నం
  • డీఎన్ఏ పరీక్ష అనగానే భయపడి అసలు నిజం చెప్పిన బాలిక
  • వివాహితుడైన బంధువుపై పోక్సో కేసు నమోదు  
నాగర్‌కర్నూల్‌లో ఇంటర్ విద్యార్థిని ప్రసవించిన కేసు అనూహ్య మలుపు తిరిగింది. తనతో పాటు చదువుకుంటున్న విద్యార్థి వల్లే గర్భం దాల్చానని చెప్పి, అతడిని ఇరికించబోయిన బాలిక.. పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది. డీఎన్ఏ పరీక్ష చేస్తామనడంతో భయపడి అసలు నిజాన్ని బయటపెట్టింది.

వివరాల్లోకి వెళితే... నాగర్‌కర్నూల్‌లోని ఓ కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని నిన్న ఓ స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, పదో తరగతి పరీక్షల సమయంలో పరిచయమైన ఓ బాలుడి వల్లే తాను గర్భవతిని అయ్యానని బాలిక తెలిపింది. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు బాలికతో పరిచయం, చాటింగ్ ఉన్న మాట వాస్తవమే కానీ, అంతకుమించి మరేమీ లేదని బాలుడు స్పష్టం చేశాడు.

దీంతో పోలీసులకు అనుమానం వచ్చి, నిజానిజాలు తేల్చేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని బాలికను గట్టిగా హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన ఆమె, అసలు విషయం చెప్పేసింది. ఇంటి సమీపంలో నివసించే వివాహితుడైన బంధువే తన గర్భానికి కారణమని ఒప్పుకుంది. వెంటనే పోలీసులు ఆ వివాహితుడిని అదుపులోకి తీసుకోగా, అతడు కూడా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Nagarkurnool Case
Nagarkurnool
Student Pregnancy
Telangana Crime
DNA Test
POCSO Act
Minor Girl
Crime News Telangana

More Telugu News