Konkona Sen Sharma: అనూహ్యమైన మలుపులతో సాగే 'అక్యూజ్డ్'

Accused Movie Update
  • విభిన్నమైన కథాంశంతో సాగే  'అక్యూజ్డ్' 
  • ప్రధానమైన పాత్రను పోషించిన కొంకణా సేన్ శర్మ
  • నెట్ ఫ్లిక్స్  నిర్మించిన కంటెంట్ 
  • ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్

'నెట్ ఫ్లిక్స్' వారు నిర్మించిన హిందీ సినిమానే 'అక్యూజ్డ్'. నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది.  విభిన్నమైన కంటెంట్ తో .. బలమైన తారాగణంతో నిర్మించిన ఈ సినిమాలో, కొంకణా సేన్ శర్మ ప్రధానమైన పాత్రను పోషించారు. కొంకణాసేన్ శర్మ ఎంచుకునే పాత్రలు విభిన్నంగా .. విలక్షణంగా ఉంటాయి. నటన విషయంలోను ఆమె తనకంటూ ఒక పత్యేకమైన మార్క్ ను సొంతం చేసుకున్నారు. 

ఈ కారణంగానే కొంకణా సేన్ శర్మ సినిమాలను .. సిరీస్ లను తప్పకుండా చూస్తుంటారు. అలా ఆమె చేసిన సినిమానే ఇది. సైకలాజికల్ థ్రిల్లర్ ను టచ్ చేస్తూ సాగే ఈ సినిమాను, ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.  అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. గైనకాలజిస్ట్ 'గీతిక' పాత్రలో ఆమె కనిపించనుంది. తన కెరియర్ లో ఈ పాత్రకు ప్రత్యేకమైన స్థానం ఇస్తానని ఆమె చెబుతుండటం విశేషం. 


కథ విషయానికి వస్తే .. గైనకాలజిస్ట్ గా గీతికకి మంచి పేరు ఉంటుంది. తన ప్రతిభకి తగిన స్థాయికి చేరుకోవడానికి ఆమెకి అవకాశాలు వస్తుంటాయి. ఈ విషయంలో ఎలాంటి పోటీని ఎదుర్కోవడానికైనా ఆమె సిద్ధమవుతుంది. అలాంటి పరిస్థితులలో ఆమెపై లైంగిక ఆరోపణలు వస్తాయి. తన కెరియర్ ను .. తన పరువు ప్రతిష్ఠలను ప్రభావితం చేసే ఆరోపణలను ఆమె ఎలా ఎదుర్కొంటుంది? అనేది కథ. 

Konkona Sen Sharma
Accused Netflix
Hindi Movie
Geetika
Gynaecologist
Sexual Harassment Allegations
Dharma Productions
OTT Release
Psychological Thriller

More Telugu News