ఆప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. పలువురు మృతి

Pakistan Airstrikes on Afghanistan Kill Civilians
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ వైమానిక దళం (పీఏఎఫ్) జరిపిన దాడులలో పలువురు ఆప్ఘన్ పౌరులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇటీవల తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడులకు ఆప్ఘన్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులు కారణమని ఆరోపిస్తున్న పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించింది. పాక్ వైమానిక దాడుల్లో పలువురు మృతి చెందారని ఆప్ఘనిస్థాన్ తెలిపింది.

నిన్న అర్ధరాత్రి పాక్ వైమానిక దళం నంగర్హార్, పాక్టికా ప్రావిన్సులలో దాడులు చేసిందని ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. మహిళలు, పిల్లలు సహా పలువురు మృతి చెందగా, డజన్ల కొద్ది గాయపడ్డారని వెల్లడించింది. మరోవైపు, తాము ఏడు ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా దాడి చేసినట్లు పాకిస్థాన్ సమాచార మంత్రి తెలిపారు.
Go Back to Shorts
Afghanistan
Pakistan
Pakistan Air Force
PAF
Airstrikes
Nangarhar
Paktika
Taliban
Terrorist groups

More Telugu News