Harish Rao: అగ్రి షో వంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తే మేలు జరుగుతుంది: హరీశ్ రావు

Harish Rao Favors Govt Agri Shows for Farmer Benefits
  • ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన అగ్రి షోను సందర్శించిన హరీశ్ రావు
  • తెలంగాణలో యూరియా కొరతను నివారించాలని డిమాండ్
  • రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్
రైతుబడి అగ్రి షో వంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తే రైతులకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన అగ్రి షోను ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణలో యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలని అన్నారు.

సాగు పనిముట్లకు రాయితీపై రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చిస్తామని హరీశ్ రావు వెల్లడించారు. అగ్రి  వంటి కార్యక్రమాలు రైతులకు అన్ని రకాలుగా దోహదపడుతాయని అన్నారు.

ఈ అగ్రి షో కార్యక్రమంలో రైతుబడికి చెందిన రాజేందర్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్ రావుపై ప్రశంసలు కురిపించారు. హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా తనకు ఫోన్ చేసి సాగర్‌లో స్థానిక పరిపాలన లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీని మీద వార్తలు రాస్తే దాని ఆధారంగా చర్యలు తీసుకుంటానని తనకు చెప్పారని గుర్తుచేసుకున్నారు. అప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద పాలన ఉండేదని అన్నారు. ఆ సమయంలో తాను రెండు మూడు వార్తలు రాశానని, మిగతా మీడియా కూడా స్పందించి వార్తలు రాసిందని అన్నారు. వాటి ఆధారంగా హరీశ్ రావు నాగార్జున సాగర్‌ను మున్సిపాలిటీగా చేసి స్థానిక పాలన జరిగేలా చేశారని గుర్తు చేసుకున్నారు.
Harish Rao
Rythubadi Agri Show
Telangana agriculture
Urea shortage
Agricultural equipment subsidy

More Telugu News