ISRO Yuvika: 27 నుంచి ఇస్రో ‘యువికా’ రిజిస్ట్రేషన్లు

ISRO Yuvika 2026 Registrations Start From 27th
  • యువికా-2006 రిజిస్ట్రేషన్లు ఈ నెల 27 నుంచి ప్రారంభం
  • 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు
  • మే నెలలో 2 వారాల పాటు రెసిడెన్షియల్ శిక్షణ

ఇస్రో ఏటా నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం ‘యువికా-2026’ రిజిస్ట్రేషన్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు (గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాధాన్యత) అర్హులు.


కార్యక్రమం ఏమిటి? 

గ్రామీణ యువతలో సైన్స్, స్పేస్ టెక్నాలజీపై ఆసక్తి పెంచడమే లక్ష్యం. స్పేస్ సైన్స్, రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ టెక్నాలజీలపై ప్రాథమిక జ్ఞానం అందిస్తారు.


శిక్షణ ఎలా ఉంటుంది?

మే నెలలో 2 వారాల పాటు రెసిడెన్షియల్ (హాస్టల్‌లో ఉండి) శిక్షణ ఇస్తారు. ఇస్రో సెంటర్లలో ప్రాక్టికల్ సెషన్లు, ప్రాజెక్టులు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి.


శిక్షణా కేంద్రాలు (ఎంచుకునే అవకాశం ఉంటుంది):

  • శ్రీహరికోట – సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్
  • హైదరాబాద్ – నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
  • డెహ్రాడూన్ – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్
  • తిరువనంతపురం – విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్
  • బెంగళూరు – యూఆర్ రావు శాటిలైట్ సెంటర్
  • అహ్మదాబాద్ – స్పేస్ అప్లికేషన్ సెంటర్
  • షిల్లాంగ్ – నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్


గ్రామీణ విద్యార్థులకు ఇస్రో సైంటిస్టులతో డైరెక్ట్ ఇంటరాక్షన్, ల్యాబ్ విజిట్లు, స్పేస్ టెక్ ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంటుంది. ఇది సైన్స్‌లో కెరీర్ ఆసక్తి ఉన్న విద్యార్థులకు బెస్ట్ అవకాశం.

ISRO Yuvika
Yuvika 2026
Indian Space Research Organisation
Space Technology Program
Student Program
Science Education
Remote Sensing
Satellite Technology
Rural Students
Space Science

More Telugu News