Ranveer Singh: మరోసారి వార్తల్లో నిలిచిన 'ధురంధర్-2'

Ranveer Singhs Dhurandar 2 Faces Safety Violation Allegations
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధురంధర్ 2’ సినిమా షూటింగ్ సెట్లో భద్రతా నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికుల భద్రతను గాలికొదిలేసిన చిత్ర నిర్మాణ సంస్థ బీ62 స్టూడియోస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ చిత్ర నిర్మాణ సమయంలో భద్రతా ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఈ కారణంగా ఆదిత్య ధర్‌కు చెందిన బీ62 స్టూడియోస్‌ను బ్లాక్‌లిస్ట్ చేయాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది. బీఎంసీ తీసుకున్న ఈ చర్యకు ఏఐసీడబ్ల్యూఏ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఒక అధికారిక లేఖను విడుదల చేసింది.

“చిత్ర పరిశ్రమలోని కార్మికులు, టెక్నీషియన్ల ప్రాణాలు, భద్రత, గౌరవంతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడలేం. ఎన్నో ఏళ్లుగా అనేక నిర్మాణ సంస్థలు భద్రతా నిబంధనలను విస్మరిస్తున్నాయని మేం ఫిర్యాదు చేస్తున్నాం. ఈ నిర్లక్ష్యం వల్లే ఏటా అగ్నిప్రమాదాలు, విద్యుత్ షాక్‌లు, సెట్లు కూలిపోవడం వంటి ఘటనల్లో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు” అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.

చట్టానికి ఏ నిర్మాణ సంస్థ అతీతం కాదని, ముంబైలో రోజూ జరిగే వందలాది షూటింగ్‌లలో చాలాచోట్ల కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఏఐసీడబ్ల్యూఏ పేర్కొంది. చిత్ర పరిశ్రమ వ్యాప్తంగా భద్రతా నిబంధనలు కఠినంగా అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
Go Back to Shorts
Ranveer Singh
Dhurandar 2
Aditya Dhar
AICWA
B62 Studios
Bollywood
Movie safety
Film industry
Brihanmumbai Municipal Corporation
BMC

More Telugu News