Zimbabwe Cricket: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయం

Zimbabwe Cricket stuns Australia in T20 World Cup
  • కొలంబో వేదికగా 23 పరుగులతో ఆసీస్‌పై జింబాబ్వే గెలుపు
  • 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసిన జింబాబ్వే
  • లక్ష్య ఛేదనలో 146 పరుగులకే చతికిలపడిన ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచ కప్‌లో అద్భుతం జరిగింది. ఆస్ట్రేలియా జట్టును జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా చతికిలపడింది. 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆస్ట్రేలియా ఆటగాడు మాట్ రెన్‌షా 65 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31) మంచి భాగస్వామ్యం అందించాడు. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బానీ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బ్రాడ్ ఇవాన్స్ మూడు, మసకద్జ, బర్ల్ చెరో వికెట్ తీశారు.

మొదటి ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 29 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత మాట్ రెన్‌షా, మ్యాక్స్‌వెల్ 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం లేకుంటే ఆస్ట్రేలియా మరింత అవమానకరంగా ఓడిపోయి ఉండేది.

Zimbabwe Cricket
Australia Cricket
T20 World Cup
T20 World Cup 2024
Cricket
Matt Renshaw

More Telugu News