Anishma Anil Kumar: ఇప్పుడు అందరినోటా ఈ అమ్మాయి మాటే!

Anishma Anil Kumar Special
షార్ట్స్‌లో చూడండి
ఇప్పుడు అందరూ ఒక అమ్మాయిని గురించి అదేపనిగా మాట్లాడుకుంటున్నారు .. చర్చించుకుంటున్నారు. ఆ అమ్మాయి గొప్ప అందగత్తెనా అంటే కాదు. స్టార్ హీరో సరసన సందడి చేసిందా అంటే... అదీ లేదు. మరి ఎందుకు ఆ అమ్మాయిని గురించి అంతా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు? ఆ అమ్మాయిని గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు? అనే ఒక సందేహం కలగకుండా ఉండదు. అంతగా అందరిని ఆకట్టుకున్న ఆ అమ్మాయి పేరే అనిష్మా అనిల్ కుమార్.

అనిష్మా తమిళంలో చేసిన 'సిరై' సినిమా రీసెంటుగా ఓటీటీలోకి వచ్చింది. తమిళంలో థియేటర్లవైపు నుంచి కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది గానీ, తెలుగు ప్రేక్షకులకు ఆ విషయం తెలియదు. ఓటీటీలో తెలుగులోను వచ్చిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. బలమైన కథాకథనాలతో ఈ సినిమా ఒక రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఒక విలేజ్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ, ప్రతి ఒక్కరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.

ఈ సినిమా చూసిన వాళ్లలో చాలామంది అనిష్మా నటనకు ఎక్కువ మార్కులు ఇస్తారు. తాను ప్రేమించిన వ్యక్తి కోసం కుటుంబ సభ్యులను .. మతాన్ని .. ఊరును .. చివరికి విధిని ఎదురించి నిలిచిన పాత్రలో అనిష్మా నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి నటనతో మెప్పించినది ఈ అమ్మాయి మాత్రమేనేమో అనిపిస్తుంది. 2023లో 'పూవన్' అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనిష్మాకి, 'సిరై'తో గట్టి హిట్ పడిందనే చెప్పాలి. తెలుగు నుంచి ఈ అమ్మాయికి మంచి పాత్రలు వెళతాయోమో చూడాలి. 

Go Back to Shorts
Anishma Anil Kumar
Sirai movie
Anishma
Tamil movie
OTT Telugu
Village love story
Poovan movie
Tamil cinema
Telugu audience
actress

More Telugu News