Sweeti Rawat: ఆ ఊళ్లో 'మందు' లేకుండా పెళ్లి చేస్తే నజరానా ఇస్తారు!

Sweeti Rawat Offers Reward for Liquor Free Weddings in Uttarakhand
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామ మహిళా సర్పంచ్ వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం ఆదర్శవంతంగా నిలుస్తోంది. జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులు ప్రశంసిస్తున్నారు. వివాహాలు, శుభకార్యాలలో మద్యం తప్పనిసరి అన్న పరిస్థితులు చాలాచోట్ల కనిపిస్తున్నాయి. ఈ అలవాటు యువతపై చెడు ప్రభావం చూపడంతో పాటు పేద కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో వివాహాల్లో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ఉత్తరాఖండ్‌లోని డోయీవాలా నియోజకవర్గ పరిధిలోని గడుల్ గ్రామ సర్పంచ్ స్వీటీ రావత్.. వివాహ వేడుకల్లో మద్యం పంపిణీ చేయకుండా పెళ్లి నిర్వహిస్తే ఆ కుటుంబానికి రూ.51 వేల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. ఈ నిబంధనను పాటించిన రెండు కుటుంబాలకు ఇప్పటికే నగదు సహాయం కూడా అందజేశారు. 

శుభకార్యాల్లో మద్యం పంపిణీ వల్ల అనవసరంగా భారీగా డబ్బు వృథా అవుతోందని, అదే సమయంలో యువత మద్యానికి బానిసయ్యే పరిస్థితి పెరుగుతోందని స్వీటీ రావత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆమె తెలిపారు. సర్పంచ్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులు ప్రశంసించారు. 

ఇదే తరహాలో గతంలో ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లాలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది. దేవ్‌ప్రయాగ్ గ్రామంలో వివాహ వేడుకను మద్యం లేకుండా నిర్వహిస్తే వధువుకు రూ.10 వేల నగదు బహుమతి అందిస్తామని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఈ మొత్తాన్ని పోలీసులు తమ వంతుగా విరాళాలు సేకరించి అందజేయడం అప్పట్లో విశేషంగా నిలిచింది.
Go Back to Shorts
Sweeti Rawat
Uttarakhand
liquor free wedding
alcohol free marriage
gadul village
Doiwala
nazarana
incentive
alcohol ban
Tehri district

More Telugu News