Ashwini Vaishnaw: ఏపీ, తెలంగాణలకు హైస్పీడ్ రైళ్లు గేమ్ ఛేంజర్.. బెంగళూరుకు 2 గంటల్లో చేరుకోవచ్చు: అశ్వినీ వైష్ణవ్

Ashwini Vaishnaw High Speed Trains Game Changer for AP Telangana
  • తెలంగాణ, ఏపీ, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందన్న కేంద్రమంత్రి
  • బడ్జెట్‌లో తెలంగాణలో రైల్వే పనులకు రూ.5,454 కోట్లు కేటాయింపు
  • హైదరాబాద్ నుంచి చెన్నై, పుణే, బెంగళూరుకు మూడు హైస్పీడ్ రైళ్లు రానున్నాయని వెల్లడి
హైస్పీడ్ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగు పెడతాయని, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో వెళ్లవచ్చని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైస్పీడ్ కారిడార్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. బడ్జెట్‌లో తెలంగాణలో రైల్వే పనులకు రూ.5,454 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

ఈ హైస్పీడ్ రైళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) గేమ్ ఛేంజర్‌గా మారతాయని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి చెన్నై, పుణే, బెంగళూరుకు 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయని, దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో వెళ్లవచ్చని అన్నారు. పుణేకు గంట 55 నిమిషాలు, చెన్నైకి 2 గంటల 55 నిమిషాల్లో చేరుకోవచ్చని అన్నారు.
Ashwini Vaishnaw
High Speed Rail
Hyderabad Bangalore
AP Telangana
Indian Railways
Rail Budget 2024

More Telugu News