ఎప్ స్టీన్ ఫైల్స్ లో న్యూయార్క్ మేయర్ తల్లి పేరు..!
- ఎప్ స్టీన్ కు రాసిన ఈ–మెయిల్ లో మీరా నాయర్ పేరు ప్రస్తావించిన పెగ్గీ సీగల్
- అమేలియా సినిమా విడుదల నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేసిన గిస్లెయిన్ మాక్స్ వెల్
- ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలతో సీగల్ ఈ–మెయిల్
‘‘మాక్స్ వెల్ నివాసంలో జరిగిన పార్టీ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. అమేలియా సినిమా రిలీజ్ సందర్భంగా మాక్స్ వెల్ తన ఇంట్లో ఈ పార్టీ ఏర్పాటు చేశారు. మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, జియాన్ పిగొని, డైరెక్టర్ మీరా నాయర్.. తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు. సినిమా పెద్దగా ఆకట్టుకునేలా లేదని అతిథులు అభిప్రాయపడ్డారు. అయితే, మహిళలను మాత్రం ఈ సినిమా చాలా ఆకట్టుకుంది” అంటూ పెగ్గీ సీగల్ పలు వివరాలను ఇందులో పేర్కొన్నాడు.