హర్యానాలో డ్రైవర్‌కు రూ.10 కోట్ల లాటరీ తగిలింది!
- సిర్సా జిల్లాలోని 35 ఏళ్ల డ్రైవర్‌ను మూడోసారి వరించిన అదృష్టం
- రూ.500కు లోహ్రీ మకర సంక్రాంతి2026 లాటరీని కొనుగోలు చేసిన పృథ్వీ సింగ్
- తన పిల్లల భవిష్యత్తు కోసం ఈ నగదును ఉపయోగిస్తానని వెల్లడి
పృథ్వీ సింగ్ రూ.500 వెచ్చించి పంజాబ్ లోహ్రీ మకర సంక్రాంతి 2026 లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. ఈ లాటరీలో అతడికి మొదటి బహుమతిగా రూ.10 కోట్లు లభించాయి. తాను లాటరీ టిక్కెట్ కొనుగోలు చేయడం ఇది మూడవసారి అని పృథ్వీ సింగ్ తెలిపాడు. ఈసారి తనకు అదృష్టం కలిసి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.
ఇంతకుముందు రెండుసార్లు కొనుగోలు చేసినప్పటికీ, తనకు ఈసారి లాటరీ తగులుతుందని ఎప్పుడూ అనుకోలేదని అన్నాడు. లాటరీ ద్వారా వచ్చిన నగదును పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని పృథ్వీ సింగ్ వెల్లడించారు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో ఒక లగ్జరీ కారు కొనివ్వమని తన తండ్రిని అడుగుతానని పృథ్వీ సింగ్ ఆరేళ్ల కుమారుడు దక్ష్ చెప్పారు.