ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
- ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఈడీ
- వైసీపీ హయాంలో మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి, ఆ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్లు అభియోగాలు
- సిట్ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా విచారణను వేగవంతం చేసిన ఈడీ
ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రాగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు అందడం చర్చనీయాంశమైంది.
మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి, ఆ డబ్బును హవాలా మార్గంలో ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు తరలించినట్లు అభియోగాలున్న నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ విచారణను మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.