దక్షిణాఫ్రికా పర్యటనలో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు
- ఆయుష్ మాత్రే గైర్హాజరీలో తొలిసారి సారథ్య బాధ్యతలు
- యూత్ వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు
- 14 ఏళ్ల వయస్సులో ఈ ఫీట్ అందుకున్న వైభవ్
ఈ సెంచరీతో వైభవ్ ఒక ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆయుష్ మాత్రే గైర్హాజరీలో తొలిసారిగా సారథ్య బాధ్యతలు చేపట్టిన సూర్యవంశీ, యూత్ వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన అండర్-19 కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు వైభవ్, ఆరోన్ మొదటి వికెట్‌కు 227 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.