తెలంగాణలో మరో 17 మంది మావోయిస్టులు మాత్రమే ఉన్నారు: డీజీపీ
- 17 మంది లొంగిపోతే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా నిలుస్తుందని వెల్లడి
- అందులో నలుగురు కేంద్ర కమిటీ, ఐదుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు వెల్లడి
- ఆపరేషన్ కగార్ గడువుకు ముందే తెలంగాణ మావోయిస్టు రహితమవుతుందన్న డీజీపీ
ఈ 17 మంది మావోయిస్టులపై మొత్తం రూ.2.25 కోట్ల రివార్డు ఉందని ఆయన చెప్పారు. వారంతా లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఆపరేషన్ కగార్ గడువు లోపే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిస్తే పోలీసు శాఖ నుంచి వారికి అవసరమైన సహాయం అందుతుందని ఆయన అన్నారు.