Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

Nitin Nabin Appointed as BJP National President
  • బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ నియామకం
  • నియామకాన్ని ఖరారు చేసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు
  • ప్రస్తుతం బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్
  • వెంటనే నియామకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసిన పార్టీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక నియామకం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబీన్‌ను నియమిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. "బీజేపీ పార్లమెంటరీ బోర్డు, బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబీన్‌ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది" అని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

45 ఏళ్ల నితిన్ నబీన్ ప్రస్తుతం బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఈ నియామకం ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.

ఇప్పటివరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జేపీ నడ్డా కొనసాగిన సంగతి తెలిసిందే. 
Nitin Nabin
BJP
Bharatiya Janata Party
Bihar
JP Nadda
Arun Singh
BJP National President
Indian Politics
National Executive

More Telugu News