సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్
- హైదరాబాద్ నగరానికి వచ్చిన అఖిలేశ్ యాదవ్
- జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో భేటీ
- అమలు చేస్తున్న పథకాల గురించి వివరించిన రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి అఖిలేశ్ యాదవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.