కర్తవ్య పథ్ లో కనిపించని ఇండియా గేట్.. వీడియో ఇదిగో!
- పొగమంచు, దానికి తోడు పొల్యూషన్
- ఢిల్లీలో తీవ్రంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
- జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాజధాని వాసులు
దేశ రాజధాని మొత్తం చూస్తే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 377 గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో ఇది 400 పాయింట్లకు కూడా చేరిందని అధికారులు వెల్లడించారు. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ఢిల్లీ వాసులు అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరం, శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, దగ్గు తదితర సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.