డాలర్ దెబ్బకు విలవిల.. 90 దాటిన రూపాయి విలువ
- డాలర్‌తో పోలిస్తే భారీగా పతనమైన రూపాయి
- చరిత్రలో మొదటిసారి 90 మార్క్‌ను దాటిన మారకం విలువ
- ట్రేడింగ్‌లో 90.14 వద్ద సరికొత్త జీవనకాల కనిష్ఠం
మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 89.96 వద్ద స్థిరపడిన రూపాయి, బుధవారం ఉదయం సెషన్ ప్రారంభమైనప్పటి నుంచే బలహీనంగా కదలాడింది. అమ్మకాల ఒత్తిడితో క్రమంగా క్షీణిస్తూ వచ్చిన రూపాయి విలువ, ఒక దశలో 90.14 వద్ద చారిత్రక కనిష్ఠాన్ని తాకింది. మార్కెట్ వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.12 వద్ద ట్రేడ్ అవుతోంది.