10,000 ఏళ్లలో తొలిసారి పేలిన ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం
- ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ వైపు విస్తరించిన బూడిద, పొగ
- అత్యంత అసాధారణ అగ్ని పర్వత విస్పోటనాల్లో ఒకటన్న శాస్త్రవేత్తలు
- అగ్నిపర్వత విస్పోటనం నేపథ్యంలో విమాన రాకపోకలపై ప్రభావం
హేలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద, పొగ ఉత్తర భారతదేశానికి కూడా విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా వాతావరణంలోకి 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద, పొగ వ్యాపించింది.
విస్ఫోటనం వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. కేరళలోని కన్నూర్ నుంచి అబుదాబికి బయలుదేరిన విమానాన్ని మార్గమధ్యలో అహ్మదాబాద్‌కు మళ్లించారు. హేలీ గుబ్బి విస్ఫోటనం కారణంగా ఆ ప్రాంతం మీదగా వెళ్లవలసిన విమాన సర్వీసులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.