దువ్వాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు ఈ నెల 20న రద్దు

Indian Railways Cancels Several Trains Via Duvvada on 20th
  • ట్రాక్ మరమ్మతుల కోసం రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • నాలుగు ఎక్స్ ప్రెస్ రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు వివరణ
  • ప్రయాణికులు గమనించాలని ప్రకటన జారీ
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ– దువ్వాడ సెక్షన్ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 20న నాలుగు ఎక్స్ ప్రెస్ రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. విజయవాడ - దువ్వాడ సెక్షన్‌లో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్నాయని వివరించింది. ఈ మార్గంలోని తుని, హంసవరం, అన్నవరం, రావికంపాడు స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ సెక్షన్ ప్రారంభం కోసం నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో కాకినాడ పోర్టు - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17267), రాజమండ్రి - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (67285), విశాఖపట్నం - కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ (17268), విశాఖపట్నం- రాజమండ్రి ఎక్స్‌ప్రెస్ (67286) రైళ్లను ఈ నెల 20 వ తేదీన రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు.
Go Back to Shorts
Indian Railways
train cancellations
Vijayawada
Duvvada
South Central Railway
railway track maintenance
automatic section
Kakinada Port
Visakhapatnam
Rajahmundry

More Telugu News