Baramulla: 'బారాముల్లా' .. ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్!
- ఉత్కంఠను రేపుతున్న 'బారాముల్లా' ట్రైలర్
- కశ్మీర్ లోయల చుట్టూ దాగిన రహస్యం
- ప్రధానమైన పాత్రలో మానవ్ కౌల్
- హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- నవంబర్ 7 నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో
'నెట్ ఫ్లిక్స్ ' నుంచి ఆడియన్స్ ను పలకరించడానికి ఇప్పుడు 'బారాముల్లా' సినిమా సిద్ధమవుతోంది. కశ్మీర్ లోని 'బారాముల్లా' అనే టౌనులో జరిగే కథ ఇది. ఆదిత్య సుహాస్ జంభాలే దర్శకత్వం వహించిన ఈ సినిమా, హారర్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. మానవ్ కౌల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా నుంచి ఈ రోజు వదిలిన ట్రైలర్ ఆసక్తికరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాపై అందరిలోను కుతూహలాన్ని పెంచుతోంది.
అందమైన కశ్మీర్ లోయలలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. 'బారాముల్లా' టౌన్ కి చెందిన పిల్లలు హఠాత్తుగా అదృశ్యమవుతూ ఉంటారు. అలా అదృశ్యమయ్యే పిల్లల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ పోతుండటంతో అందరిలో ఆందోళన మొదలవుతుంది. ఈ మిస్సింగ్ కేసుల మిస్టరీని ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ రిద్వాన్ రంగంలోకి దిగుతాడు. తన సర్వీస్ లో ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ వచ్చిన ఆయనకి ఈ కేస్ సవాలు విసురుతుంది.
పిల్లలు ఎలాంటి పరిస్థితులలో అదృశ్యమయ్యారు? .. ఎక్కడ అదృశ్యమయ్యారు? ఈ కేసు విషయంలో అనుమానితులు ఎవరు? ఎటువైపు నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాలి? అనే విషయమై ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటపడతాయి? అతనికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? అనేది కథ. నవంబర్ 7వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.