హరీశ్ రావు తండ్రి పార్థివదేహానికి నివాళులర్పించిన కేసీఆర్, కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హరీశ్ రావు తండ్రి పార్థివదేహానికి నివాళులర్పించిన కేసీఆర్, కేటీఆర్

KCR KTR Pay Tribute to Harish Raos Father Satyanarayana Rao
  • ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సత్యనారాయణ రావు
  • తన బావ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన బీఆర్ఎస్ అధినేత
  • సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. కోకాపేటలోని క్రిన్స్‌విల్లాస్‌లో ఉన్న సత్యనారాయణ రావు పార్థివ దేహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. అనంతరం హరీశ్ రావును, ఆయన తల్లి, తన ఏడో సోదరి అయిన లక్ష్మిని కేసీఆర్ పరామర్శించారు.

సత్యనారాయణ రావు, కేసీఆర్‌కు స్వయానా బావ అవుతారు. ఈ సందర్భంగా తన బావతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సత్యనారాయణ రావు మృతి వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ ఫోన్‌లో హరీశ్ రావుతో మాట్లాడి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.

అదే విధంగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సత్యనారాయణ రావు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా సత్యనారాయణ రావుకు నివాళులర్పించి, హరీశ్ రావు కుటుంబాన్ని పరామర్శించారు.
Advertisement
Harish Rao
Tanneeru Satyanarayana Rao
KCR
KTR
BRS Party
Telangana Politics
Condolences
Obituary
Telangana News
Political News

More Telugu News