'బాహుబలి' రీ రిలీజ్.. సరికొత్త ట్రైలర్ వచ్చేసింది!
- రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్'గా రీ రిలీజ్
- ఈ నెల 31న థియేటర్లలోకి రానున్న సినిమా
- తాజాగా సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్
- ఐమాక్స్, 4డీఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రదర్శన
- మెరుగైన సౌండ్, పిక్చర్ క్వాలిటీతో సరికొత్త అనుభూతి
- 3 గంటల 44 నిమిషాల నిడివితో సెన్సార్ పూర్తి
ఈసారి కేవలం పాత సినిమాను మళ్లీ ప్రదర్శించడమే కాకుండా, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సాంకేతికంగా ఎన్నో మార్పులు చేశారు. అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్లయిన ఐమాక్స్, 4డీఎక్స్, డాల్బీ సినిమాలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రీమాస్టర్ చేసిన పిక్చర్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో ‘బాహుబలి’ ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడని విధంగా బిగ్ స్క్రీన్‌పై ఆస్వాదించే అవకాశం కలగనుంది.
రెండు భాగాలను కలిపి రూపొందించిన ఈ సింగిల్ వెర్షన్ నిడివి 3 గంటల 44 నిమిషాలుగా ఖరారు చేశారు. ఇప్పటికే ఈ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఒక దశాబ్దం తర్వాత తమ అభిమాన సినిమాను ఐమాక్స్ వంటి ఆధునిక సాంకేతిక ఫార్మాట్‌లో చూసేందుకు సినీ ప్రియులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.