మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
- తాజాగా బయటకు వచ్చిన 4 పేజీల సూసైడ్ లెటర్
- ఓ ఎంపీ నుంచి కూడా వేధింపులు ఎదుర్కొన్నట్లు లేఖలో వెల్లడించిన వైద్యురాలు
- ఫేక్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ల కోసం ఎంపీ బెదిరించారని ఆరోపణ
ఎస్ఐ గోపాల్ బాద్నే పలువురు నిందితులను వైద్య పరీక్షలకు తీసుకువచ్చేవాడని, వారు ఫిట్ గా లేకున్నా కూడా ఫేక్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని బాధిత వైద్యురాలు తన లేఖలో వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో నిందితులను ఆసుపత్రికి తీసుకురాకుండానే సర్టిఫికెట్ ఇవ్వాలని వేధించాడని తెలిపింది.
ఓ ఎంపీ అనుచరులు ఇద్దరు వచ్చి ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని అడిగితే తాను నిరాకరించానని లేఖలో వెల్లడించింది. దీంతో వారు ఎంపీకి ఫోన్ చేసి తనతో మాట్లాడించారని, ఫోన్ లో ఎంపీ తనను పరోక్షంగా బెదిరించారని వైద్యురాలు ఆరోపించింది. ఓవైపు ఎస్ఐ బాద్నే తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తుండగా.. మరోవైపు, ఎంపీ నుంచి బెదిరింపులు రావడంతో తీవ్ర భయాందోళనలకు గురై బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు బాధితురాలు తన లేఖలో వెల్లడించింది.